1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
  4. health benefits with cooked egg, a little honey together

ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి తీసుకుంటే... పురుషులకు...

ఇటీవలి కాలంలో పురుషుల్లో చాలామందిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య శీఘ్రస్ఖలనం. ఈ సమస్యకు మందులు వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కాని పూర్తిగా కాదు. అయితే మనకు ప్రకృతి ఇచ్చిన కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అన్నింటికన్నా ముందు

health benefits
ఇటీవలి కాలంలో పురుషుల్లో చాలామందిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య శీఘ్రస్ఖలనం. ఈ సమస్యకు మందులు వాడినా అప్పటికే ప్రయోజనం చేకూరుతుంది కాని పూర్తిగా కాదు. అయితే మనకు ప్రకృతి ఇచ్చిన కొన్ని పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అన్నింటికన్నా ముందు మానసిక ఒత్తిడిని చాలావరకు తగ్గించుకోవాలి. తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అయితే ఈ శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించే చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
 
1. ఒక స్పూన్ అల్లం రసంలో సగం ఉడికించిన కోడిగుడ్డు, కొద్దిగా తేనె కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో శీఘ్ర స్ఖలనం, తరచుగా అప్రయత్నంగా వీర్యం పోవడం తగ్గి శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
 
2. ఒక టీ స్పూన్ క్యారెట్ విత్తనాలను ఒక గ్లాసు ఆవుపాలలో దాదాపు పది నిముషాలు మరిగించి తీసుకుంటే శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది.
 
3. ఒక స్పూన్ ముల్లంగి గింజల్ని ఆవు పాలలో వేసి బాగా కాచి, చల్లార్చి వడకట్టి, ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే శీఘ్ర స్ఖలన సమస్య నుండి బయటపడవచ్చు. 
 
4. ఎండిన మామిడి పిందెలను చూర్ణం చేసి నాల్గింతల పంచదార లేదా పటికబెల్లం కలిపి, అర స్పూను వంతున రోజూ రెండు పూటలా నీటితో సేవిస్తుంటే శీఘ్ర స్ఖలన సమస్య తగ్గుతుంది.
 
5. పచ్చ కర్పూరం, జాజికాయ, జాపత్రి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకుని తగినంత ఎండుద్రాక్ష కలిపి నూరి, సెనగలంత మాత్రలు చేసుకుని రాత్రి పడుకునే ముందు ఒక మాత్ర చొప్పున కప్పు పాలతో సేవిస్తుంటే పురుషుల్లో శీఘ్ర స్ఖలనం తగ్గి శృంగార సామర్థ్యం పెరిగి, దాంపత్య సమయంలో సంతృప్తి కలగడమే కాక రతికార్యం తరువాత నీరసం లేకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
About Writer
chj
తర్వాతి కథనం
మునగాకు పొడిని ఇలా తింటే బరువు తగ్గుతారు..