సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By జె
Last Modified: శుక్రవారం, 13 డిశెంబరు 2019 (21:05 IST)

కొత్తగా పెళ్ళయిన భార్యతో శోభనం రోజు రాత్రి ఎలా?

అమ్మాయిలు సహజంగా సుకుమారులు పువ్వులు వంటివారు. వారి మనస్సు మృదువైనదంటుంటారు. అందుకని నూతన వధువుతో శృంగారానికి ఉపక్రమించేటప్పుడు నూతన వరుడు సుకుమారంగా, నాజూకుగా ప్రవర్తించాలట. ఏ సమయంలోను బలాత్కారం కూడదంటున్నారు. నవ వధువు మనస్సుకు ముందు అతని మీద నమ్మకం కలగాలట. ప్రేమ కలవాలట.
 
అతని పొందు కావాలనే కోరిక పుట్టించాలట. పెళ్ళి అయిన తరువాత ఆ అమ్మాయి పూర్తిగా తన సొంతమే అనుకుని తనలో ఉరకలేసే కోరికతో మీదకు ఉరికితే ఆ తరుణి హతాశురాలవుతుందట. అటువంటి మొగుడ్ని మోటు మనిషిగా భావిస్తుందట. కొత్త పెళ్ళి కూతురు ఎప్పుడూ నాజూకుదనాన్ని కోరుకుంటుందట. ఊపిరి సలపకుండా కౌగిలించుకోవడం, ముద్దులతో ముంచేయడం, ఆగమన్నా ఆగకపోవడం జరిగితే ఆమెలో కోపం, అసహ్యం, చీదరింపు కలుగుతాయట.
 
యుక్తి లేని నూతన వరుడు దేనిని రక్తికట్టించలేడని తెలుసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నూతన వధూవరులిద్దరు ఒకరి మీద ఒకరికి క్రేజ్ కలిగే విధంగా మొదటి నుంచి వ్యవహరించాలట. మృదువైన తీరు ఇద్దరి మధ్య అనురక్తిని కలిగిస్తుందట. ఆనందపు టంచులకి చేరుస్తుందట. అనుభూతులని మదిలో మిగిలిపోయేటట్లు చేస్తుందట. మనస్సులు కలిసిన మనుష్యులై ఒకటైనప్పుడు వాళ్ళ శృంగార ఎక్స్‌ప్రెషన్స్ తీరే వేరంటున్నారు. ఆ తీపి అనుభూతే వేరట.