బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (10:59 IST)

రంగస్థలంలో సమంతలా డీ గ్లామర్ రోల్-ఎర్రచందనం కూలీగా రష్మిక

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు సమాచారం. 
 
అలానే ఈ సినిమాలో అల్లు అర్జున్, ఇంతక మునుపెన్నడూ కనిపించనంత మాస్, రఫ్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇంకా గీత గోవిందం హీరోయిన్ రష్మిక ఒక ఎర్రచందనం కూలీగా పూర్తిగా డీ గ్లామర్ రోల్‌లో నటిస్తున్నట్లు సమాచారం. రంగస్థలంలో సమంత మాదిరిగా ఈ సినిమా ద్వారా రష్మిక మంచి పేరు సంపాదించడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.