శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 9 నవంబరు 2019 (20:21 IST)

ఇది శరీరాన్ని వేడెక్కించి భాగస్వామితో బాగా శృంగారం చేసే సామర్థ్యం ఇస్తుందట

సాధారణంగా లవంగాలను వంటలకే వాడుతుంటాం. ఎక్కువగా బిర్యానీలకు ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి లవంగాన్ని రోజు మూడు పూటలు తింటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అంటున్నారు వైద్య నిపుణులు. లవంగాన్ని మూడు పూటలా భోజనం చేసిన తరువాత తింటే జీర్ణాశయం బాగా పనిచేస్తుందట. అలాగే జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం పోతాయి. తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. దగ్గు, జలుబు లాంటివి దూరం చేస్తాయి.
 
అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉంటే అవి వెంటనే తగ్గిపోతాయి. క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. డయాబెటిస్‌తో బాధపడేవారు లవంగం తింటే అదుపులో ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. నొప్పులు, వాపులను తగ్గిస్తుందట. అలాగే శరీరంలో నీళ్ళు ఎక్కువగా చేరనీయకుండా చేస్తుందట. తలనొప్పిగా ఉన్నప్పుడు పాలలో చిటికెడు లవంగాల పొడిని కలుపుకుని తాగితే వెంటనే తగ్గిపోతుందట. 
 
అంతేకాదు శరీరాన్ని వేడెక్కించి భాగస్వామితో బాగా శృంగారం చేసే సామర్థ్యం ఇస్తుందట. ఎక్కువసేపు శృంగారం చేయవచ్చట. వీలు చిక్కినప్పుడల్లా నోట్లో లవంగాన్ని పెట్టుకుంటే కోరికలు ఎక్కువగా పుడతాయంటున్నారు శృంగార నిపుణులు.