శుక్రవారం, 13 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (14:18 IST)

కొడుకును చంపేసి మూటకట్టి మూసీలో పడేసిన తండ్రి!!

murder
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. పాతబస్తీ - బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేసిన తండ్రి మహ్మద్ అక్బర్. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయాపుళ్ బ్రడ్జి పై నుంచి మూసీలో పడిసేన తండ్రి. ఆపై ఏమీ తెలియదన్నట్టుగా బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానంతో తమదైనశైలిలో పోలీసులు విచారించగా, నిజం ఒప్పుకున్న తండ్రి. బాలుడి మృతదేహం కోసం బండ్లగూడ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎప్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. 
 
ప్రియురాలిని కత్తితో పొడిచి చంపేసిన మాజీ ప్రియుడు 
 
ఏపీలోని నెల్లూరు నగరంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం దారుణంగా ముగిసింది. బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన మైథిలీప్రియ అనే యువతి, తన పూర్వ ప్రియుడి చేతిలో కత్తిపోటుకుగురై మరణించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
పోలీసుల కథనం ప్రకారం, బీఫార్మసీ పూర్తి చేసిన మైథిలీప్రియ (23), విద్యాభ్యాస సమయంలో రాపూరు మండలానికి చెందిన నిఖిల్ అనే యువకుడిని ప్రేమించింది. కొంతకాలం వీరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. అయితే, నిఖిల్ ఇటీవల మరొక యువతితో సన్నిహితంగా ఉండటంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
 
ప్రస్తుతం బెంగళూరులోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మైథిలీప్రియ, పది రోజుల క్రితం నెల్లూరుకు వచ్చింది. నిఖిల్ ఫోన్ చేసి మాట్లాడాలని పిలవడంతో, ఆమె తన చెల్లెలు ఇంట్లో ఉండగా నిఖిల్ వద్దకు వెళ్ళింది. నిఖిల్ తన గదిలో మైథిలీప్రియపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మైథిలీప్రియ అక్కడికక్కడే మృతి చెందింది.
 
ఆ తర్వాత, నిఖిల్ మైథిలీప్రియ సోదరికి ఫోన్ చేసి, వారి మధ్య గొడవ జరగడం వల్ల కత్తితో పొడిచానని చెప్పాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ సంఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.