మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (09:56 IST)

ముల్లంగి రసాన్ని రోజుకో గ్లాసుడు తీసుకుంటే.. సలాడ్‌లో కలుపుకుంటే?

వేసవిలో ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీర్ణశక్తిని వృద్ధిచేసే ముల్లంగి పైల్స్ వ్యాధికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ముల్లంగి మూత్రపిండాలను ఆరోగ్యంగా వుంచుతుంది. శ

వేసవిలో ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జీర్ణశక్తిని వృద్ధిచేసే ముల్లంగి పైల్స్ వ్యాధికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ముల్లంగి మూత్రపిండాలను ఆరోగ్యంగా వుంచుతుంది. శరీర బరువును తగ్గిస్తుంది. ముల్లంగిలోని విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చు. 
 
రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌ రూపంలో తీసుకోగలిగితే 'సి' విటమిన్‌ పుష్కలంగా అందుతుంది. తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు నయం అవుతాయి. వేసవిలో వారానికి ఓసారైనా ముల్లంగిని ఆహారంలో చేర్చుకోవాలి. ముల్లంగి రక్తంలోని వ్యర్థాలను తొలగించి రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకొంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. ముల్లంగి రసం రోజుకో గ్లాసుడు తీసుకుంటే పైల్స్ వ్యాధిని నియంత్రించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.