గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (11:57 IST)

వేసవిలో రోజూ అల్పాహారానికి ముందు రాగి జావ తీసుకోవాల్సిందే..

రాగులు బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో ర

రాగులు బలవర్ధకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లైతే పిల్లలు బాగా ఎదుగుతారు. వేసవిలో రాగి పదార్థాలను తీసుకోవడం ద్వారా కడుపులో మంటను తగ్గుతుంది. 
 
శరీరానికి చలవ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దాహార్తిని తగ్గిస్తుంది. వృద్ధాప్యంలో వున్న వారు వేసవిలో రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి శక్తి చేకూరుతాయి. అలాగే మూడు పదులు దాటిన మహిళలు, యువతులు కూడా ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. 
 
రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో రాగి జావ, రాగి అంబలి, రాగి సంకటిని రోజూ డైట్‌లో చేర్చుకోవాలి. రాగితో పాటు మజ్జిగ, పెరుగును కలుపుకుని అంబలి తీసుకుంటే ఆరోగ్యంతో పాటు వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.