శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (11:36 IST)

వేసవిలో ఆ సబ్బులు వాడకండి..

వేసవిలో చెమటతో ఏర్పడే చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవాలంటే.. అలోవెరా, నిమ్మ, తులసిని తప్పకుండా వుపయోగించాలి. చర్మంపై మచ్చలు, మొటిమలు, చెమటకాయలు తొలగిపోవాలంటే.. స్నానం చేసేముందు అలోవెరా గుజ్జును చర్

వేసవిలో చెమటతో ఏర్పడే చర్మ సంబంధిత సమస్యలను దూరం చేసుకోవాలంటే.. అలోవెరా, నిమ్మ, తులసిని తప్పకుండా వుపయోగించాలి. చర్మంపై మచ్చలు, మొటిమలు, చెమటకాయలు తొలగిపోవాలంటే.. స్నానం చేసేముందు అలోవెరా గుజ్జును చర్మానికి పట్టించాలి.

ఇంకా నిమ్మరసం, తులసి పేస్టును చర్మానికి రాస్తే మంచి ఫలితం వుంటుంది. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
అలాగే చర్మంపై పొర మీద తేమ శాతాన్ని కాపాడేందుకు రసాయనాలు కలిపిన సబ్బులు కాకుండా హెర్బల్ సబ్బులు వుపయోగించాలి. తేనె, తులసి, అల్లం, అలోవెరా, నిమ్మ కలిపిన హెర్బల్ సబ్బులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. సబ్బులో ఉండే నిమ్మ చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచి, రంగు మారకుండా మచ్చలు ఉండకుండా కాపాడుతుంది.
 
అంతేకాకుండా చర్మం పొడిబారకుండా, చర్మ వ్యాధుల నుండి కలబంద కాపాడుతుంది. గులాబీపువ్వులు, తులసీ ఆకులతో కూడిన క్రీములు వాడితే చర్మం మెరిసిపోతుంది. హెర్బల్ షాంపూలు కూడా జుట్టుకి సహజ ఔషధంగా పనిచేస్తున్నాయి.