సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (15:19 IST)

లెమన్ టీ ఓ కప్పు సేవిస్తే...? కొలెస్ట్రాల్ మటాష్

లెమన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లాక్ టీలో ఒక స్పూన్ నిమ్మరసాన్ని పిండుకుని పరగడుపున తాగడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. కాఫీలు, టీల కంటే లెమన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వే

లెమన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బ్లాక్ టీలో ఒక స్పూన్ నిమ్మరసాన్ని పిండుకుని పరగడుపున తాగడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. కాఫీలు, టీల కంటే లెమన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. లెమన్ టీ సేవించడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 
 
మగతగా వుంటే, అజీర్తి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే లెమన్ టీ ఓ కప్పు సేవిస్తే సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు, పోషకాలు శరీరానికి కొత్త ఉత్సాహాన్నిస్తాయి. 
 
ప్రత్యేకించి లెమన్‌ టీలో జీవక్రియలను, జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేసే శక్తులు పుష్కలంగా వుంటాయి. తద్వారా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.