శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (12:43 IST)

నిమ్మకాయను కట్ చేసి పడకగదిలో వుంచితే.. జలుబు, దగ్గు మటాష్?

జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ గదిలో నిమ్మకాయను సగానికి కోసి.. ఉంచితే సరిపోతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎలాంగంటే..? నిమ్మకాయ ఆరోగ్యానికే కాకుండా మన ఇంటిని శుభ్రంగా వుంచేందుకు కూడా

జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ గదిలో నిమ్మకాయను సగానికి కోసి.. ఉంచితే సరిపోతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎలాంగంటే..? నిమ్మకాయ ఆరోగ్యానికే కాకుండా మన ఇంటిని శుభ్రంగా వుంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని తీసుకోవడం ద్వారా ఇంకా నిమ్మకాయ వాసనను పీల్చడం ద్వారా జలుబు, దగ్గు, ఆస్తమా, అలెర్జీ, గొంతు నొప్పి తగ్గుతుంది. 
 
ఇలాంటి రుగ్మతలను తొలగించుకోవాలంటే.. అనారోగ్యాలతో బాధపడేవారు నిద్రించే గదిలో నిమ్మను అడ్డంగా కట్ చేసి వుంచాలి. దీనిద్వారా నిమ్మ శ్వాసను పీల్చుకోవచ్చు. ఇంకా వ్యాధులను వ్యాపించకుండా నియంత్రించవచ్చు. నిమ్మ పండు నుంచి సువాసనను పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు, మెదడు పనితీరు మెరుగవుతుంది. వ్యాధులను వ్యాపించకుండా నియంత్రించాలంటే.. నిమ్మకాయను ఉపయోగించాలి. నిమ్మకాయను కట్ చేసి పడకగదిలో వుంచడం ద్వారా క్రిములు నశిస్తాయి.  
 
అలాగే వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలకు నిమ్మ చెక్ పెడుతుంది. నిమ్మరసం, కలబంద నూనెను కలిపి చెమటకాయలున్న ప్రాంతంలో రాస్తే సత్వర ఉపశమనం లభిస్తుంది.

అలాగే స్నానం చేసే నీటిలో ఒక మూత నిమ్మరసాన్ని కలిపి స్నానం చేస్తే శరీర తాపం తగ్గుతుంది. చర్మ వ్యాధులుండవు. ఇక నిమ్మరసాన్ని తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. నిమ్మచెక్కలను మోకాళ్లకు, చేతి మడమలకు రాస్తే చర్మం మెరిసిపోతుంది. మొటిమలను ఇవి దూరం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.