శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 15 మార్చి 2018 (14:47 IST)

సన్‌స్క్రీన్ లోషన్స్ వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

ఎండకాలం వచ్చేసిందండోయ్. సాధారణంగా ఆడవాళ్లు ఈ ఎండాకాలంలో బయటకు వెళ్లాలంటే భయపడతారు. ఎందుకంటే చర్మ సౌందర్యానికి సమస్యలు వస్తాయని. కాని తప్పనిసరిగా ఎండలో బయటకు వెళ్లవలసి వచ్చినపుడు సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సిందే అనుకుంటారు. అయితే వీటితో జాగ్రత్త. సన్‌స

ఎండకాలం వచ్చేసిందండోయ్. సాధారణంగా ఆడవాళ్లు ఈ ఎండాకాలంలో బయటకు వెళ్లాలంటే  భయపడతారు. ఎందుకంటే చర్మ సౌందర్యానికి సమస్యలు వస్తాయని. కాని తప్పనిసరిగా ఎండలో బయటకు వెళ్లవలసి వచ్చినపుడు సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సిందే అనుకుంటారు. అయితే వీటితో జాగ్రత్త. సన్‌స్క్రీన్ లోషన్లతో మేలు కంటే కీడే ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. ఈ లోషన్ల వల్ల శరీరానికి విటమిన్ డి సరిగ్గా అందటం లేదని వెల్లడయింది. శరీర ఆరోగ్యానికి, ఎముకల పెరుగుదలకు విటమిన్ డి చాలాముఖ్యం అనే విషయం మన అందరికి తెలిసిందే.
 
అయితే ఎంతసేపు ఇంట్లోనో, ఆఫీసులలోనో, ఎసి గదులలోనో గడుపుతూ చాలామంది ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్లవలసి వచ్చినా సన్‌స్క్రీన్ లోషన్లు పట్టించి కాని కాలుబయట పెట్టటం లేదు. ఈ లోషన్లు సూర్యరశ్మి ద్వారా  చర్మానికి అందే విటమిన్ డిని అడ్డుకుంటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫలితంగా విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఇది కండరాల పటిష్టతను, ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. మరి వ్యాధుల ముప్పు లేకుండా విటమిన్ డి లోపాన్ని నివారించేందుకు వారంలో రెండుసార్లు మధ్యహ్నపు ఎండలో కాసేపు నిలుచోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.