శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (23:12 IST)

శీకాకాయతో ఆరోగ్య ప్రయోజనాలు... ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు...

శీకాకాయ కేవలం చర్మానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది చర్మ సౌందర్యానికే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాం. 1. శీకాకాయల చూర్ణాన్నినీటితో పేస్టులా చేసి రాసుకుంటే ఎగ్జిమా, తెల్లమచ్చలు తగ్గిపోతాయి.

శీకాకాయ కేవలం చర్మానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది చర్మ సౌందర్యానికే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. అవేమిటో తెలుసుకుందాం.
1. శీకాకాయల చూర్ణాన్నినీటితో పేస్టులా చేసి రాసుకుంటే ఎగ్జిమా, తెల్లమచ్చలు తగ్గిపోతాయి. శీకాకాయల కషాయంతో నోరు పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది. శీకాకాయల చూర్ణాన్ని కొబ్బరి నూనెలో కలిపి దురదలున్న చోట పూస్తే ఉపశమనం కలుగుతుంది.
2. శీకాకాయల పులుసుతో తల రుద్దుకుంటే తలలోని వేడి తగ్గడంతో పాటు వెంట్రుకులకు మృదుత్వం, బలం చేకూరుతాయి.
3. శీకాకాయ చెట్టు చిగుళ్లతో పచ్చడి తయారుచేసుకుని వాడుతూ ఉంటే ఆకలి వృద్ది చెందడంతో పాటు కడుపులో మంట, పైత్యం తగ్గుతాయి.
4. శీకాకాయలను మెత్తగా చూర్ణించి గోమూత్రంలో కలిపి పేస్టులా చేసి తెల్ల మచ్చలపై లేపనంగా వేస్తే బొల్లిమచ్చలు తగ్గిపోతాయి.
5. 30 మిల్లీ శీకాకాయల కషాయాన్ని తాగితే సుఖ విరేచనం కావడంతో పాటు శరీరంలోని విష పదార్థాలు, మలినాలు బయటకు పోతాయి.