సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (15:44 IST)

బొప్పాయి ముక్కలను తేనెలో కలిసి రోజూ తీసుకుంటే?

అన్నీ సీజన్లలో లభించే బొప్పాయిలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి ఆకులు, గింజలు, పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలున్నాయి. బొప్పాయి పండ్లు బరువును తగ్గిస్తాయి. కీళ్ళ నొప్పులను నయం చేస్తాయి. మధ

అన్నీ సీజన్లలో లభించే బొప్పాయిలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి ఆకులు, గింజలు, పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలున్నాయి. బొప్పాయి పండ్లు బరువును తగ్గిస్తాయి. కీళ్ళ నొప్పులను నయం చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తాయి. చర్మాన్ని కాపాడుతాయి. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. పేగుల్లో ఏర్పడే అలర్జీలకు చెక్ పెడతాయి. 
 
అలాగే బొప్పాయి ముక్కలను రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పిల్లల పెరుగుదలకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. దంతాలు, ఎముకలకు బలాన్నిస్తాయి. పచ్చి బొప్పాయి ముక్కలను వేపుళ్ల రూపంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. కాలేయం, కిడ్నీ సంబంధిత రోగాలు నయం అవుతాయి. బొప్పాయి ముక్కలను తేనేతో కలిపి తీసుకుంటే నరాల బలహీనత నయం అవుతుంది. రోజూ కప్పు తేనె కలిపిన బొప్పాయి ముక్కలు ఒబిసిటీని దరిచేరనివ్వవు. 
 
బొప్పాయి గుజ్జును తేనెతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. బొప్పాయి గింజల పొడిని పాలలో కలపి తీసుకుంటే ఉదర సంబంధిత రుగ్మతలు నయం అవుతాయి. పిల్లలకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. రోజూ అరకప్పు బొప్పాయి ముక్కలను పిల్లల స్నాక్స్ బాక్సుల్లో ఇవ్వడం ద్వారా వారిలో పెరుగుదల సులువవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.