ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (15:22 IST)

బెల్లంతో ఆ నొప్పులు మాయం..

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మహిళలను వేధించే నెలసరి నొప్పులను బెల్లం మాయం చేస్తుంది. నెలసరి సమయాల్లో వచ్చే కడుపునొప్పికి చెక్ పెట్టాలంటే.. రెండు పూటలా వేడిపాలలో చిన్న బెల్లం ముక్క వేసుకుని

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మహిళలను వేధించే నెలసరి నొప్పులను బెల్లం మాయం చేస్తుంది. నెలసరి సమయాల్లో వచ్చే కడుపునొప్పికి చెక్ పెట్టాలంటే.. రెండు పూటలా వేడిపాలలో చిన్న బెల్లం ముక్క వేసుకుని తాగితే మంచి ఫలితం వుంటుంది. నెలసరి వచ్చే రెండు మూడు రోజుల నుంచి క్రమం తప్పకుండా బెల్లం కలిపిన పాలు తీసుకోవడం చేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే ఆందోళన, గుండెదడతో బాధపడేవారు.. ఆహారం తీసుకున్న వెంటనే కొత్తిమీర, బెల్లంపొడి, సోంపు పొడిని సమపాళ్లలో తీసుకుని నీటిలో కలిపి సేవిస్తే మంచి ఫలితం వుంటుంది. ఇక గొంతు గరగరమంటే తులసీ రసంలో కాసింత బెల్లం కలుపుకుని తీసుకోవాలి. అజీర్తి సమస్యలతో బాధపడేవారు భోజనం తరువాత చిన్న బెల్లం ముక్క తినడం తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. 
 
ఇకపోతే.. పిండివంటల్లో పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఎంచుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే బెల్లంలో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా వున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.