సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By selvi
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:35 IST)

చర్మం తాజాగా వుండాలంటే..? మల్లెలతో స్నానం చేయండిలా?

చర్మం మృదువుగా తాజాగా వుండాలంటే.. జాస్మిన్‌లతో స్నానం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అరగ్లాసు సోయా ఆయిల్, ఐదారు చుక్కలు జాస్మిన్ ఆయిల్.. ఆరు చుక్కల నిమ్మరసం కలిపి స్నానం చేసే నీటిలో కలిపితో శరీ

చర్మం మృదువుగా తాజాగా వుండాలంటే.. జాస్మిన్‌లతో స్నానం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అరగ్లాసు సోయా ఆయిల్, ఐదారు చుక్కలు జాస్మిన్ ఆయిల్.. ఆరు చుక్కల నిమ్మరసం కలిపి స్నానం చేసే నీటిలో కలిపితో శరీరానికి విటమిన్-ఇ లభిస్తుంది. 
 
ఆరోగ్యకరమైన హెయిర్ మసాజ్ కోసం ద్రాక్షరసం అర కప్పు, జాస్మిన్ ఆయిల్ మూడు స్పూన్లు, రోజ్ మేరీ ఆయిల్ మూడు చుక్కలు తీసుకుని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. 
 
ఇంకా మూలికల మిశ్రమాలతో అంటే రోజ్ వుడ్, గంధం, నిమ్మ కలిపి స్నానం చేసే నీటితో కలిపికో శరీరం మృదువుగా తయారవుతుంది. మల్లెలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. మల్లెల ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.