శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: గురువారం, 22 ఫిబ్రవరి 2018 (20:44 IST)

అందమైన కనుబొమల కోసం నాలుగు సూత్రాలు

అందంగా ఉండాలి అంటే కనుబొమలు నల్లగా, వత్తుగా ఉండాలి. ఇలా వుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందుకే ఇంట్లో వున్న పదార్థాలతోనే మన కనుబొమలను అందంగా మార్చుకోవాలి. ఎలా అంటే... 1. ఉల్లిపాయ రసాన్ని కనుబొమలకు ఐదు నిమిషాలపాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లట

అందంగా ఉండాలి అంటే కనుబొమలు నల్లగా, వత్తుగా ఉండాలి. ఇలా వుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందుకే ఇంట్లో వున్న పదార్థాలతోనే మన కనుబొమలను అందంగా మార్చుకోవాలి. ఎలా అంటే...
 
1. ఉల్లిపాయ రసాన్ని కనుబొమలకు ఐదు నిమిషాలపాటు మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
2. ఆముదం నూనెలో దూదిని ముంచి కనుబొమలకు రాసుకోవాలి. కొంచెం సేపయ్యాక కడిగేసుకోవాలి. ఇలా మూడు వారాల పాటు చేస్తే తేడా మీకే తెలుస్తుంది.
 
3. గుడ్డు సొన జుట్టుకు మాత్రమే కాకుండా కనుబొమలు ఆకర్షణీయంగా కనపడేలా చేస్తుంది. కేవలం కోడిగుడ్డు సొనను మాత్రమే కనుబొమలకు రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
 
4. మెంతుల్లో ఉన్న ఔషధ గుణాలతో శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే వీటిని వంటల్లో ఎక్కువుగా ఉపయోగిస్తారు. నిద్రపోయేముందు మెంతులను నీళ్లల్లో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేచాక వాటిని పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలిపి కనుబొమలకు రాసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే , చక్కని కనుబొమలు మీ సొంతం.