శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (11:21 IST)

కోమలమైన చర్మం కోసం.. కలబంద గుజ్జును ఇలా?

కోమలమైన శరీరం కోసం మగువలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జిడ్డు చర్మానికి చెక్ పెట్టేందుకు.. ముడతలను దూరం చేసుకునేందుకు.. మచ్చలను తొలగించేందుకు ఈ చిట్కా పాటించండి.. అంటున్నారు బ్యూటీషియన్లు.

కోమలమైన శరీరం కోసం మగువలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. జిడ్డు చర్మానికి చెక్ పెట్టేందుకు.. ముడతలను దూరం చేసుకునేందుకు.. మచ్చలను తొలగించేందుకు  ఈ చిట్కా పాటించండి.. అంటున్నారు బ్యూటీషియన్లు. 
 
నాలుగైదు స్పూన్ల కలబంద గుజ్జు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, అర టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, నాలుగు చుక్కల తేనెను తీసుకుని బాగా మిక్స్ చేసి పక్కబెట్టాలి. తర్వాత ఐస్ వాటర్‌తో ముఖాన్ని కడిగేసి.. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 
 
ముఖం, మెడ చేతులకు ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుని.. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. చర్మం కోమలత్వాన్ని సంతరించుకుంటుంది.