శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (17:52 IST)

నెలసరి సమయంలో పొత్తి కడుపులో నొప్పికి?

నెలసరి సమయంలో పొత్తి కడుపులో వచ్చే నొప్పిని నివారించాలంటే గోరువెచ్చని నీళ్లు సేవిస్తే మంచి ఫలితం వుంటుంది. నెలసరి సమయంలో శరీరంలోని టాక్సిన్లను తొలగించేందుకు గోరువెచ్చని నీరు సేవించడం ఉత్తమం. అలాగే నెల

నెలసరి సమయంలో పొత్తి కడుపులో వచ్చే నొప్పిని నివారించాలంటే గోరువెచ్చని నీళ్లు సేవిస్తే మంచి ఫలితం వుంటుంది. నెలసరి సమయంలో శరీరంలోని టాక్సిన్లను తొలగించేందుకు గోరువెచ్చని నీరు సేవించడం ఉత్తమం. అలాగే నెలసరిలో కడుపు నొప్పికి తగ్గాలంటే.. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి.

జంక్ ఫుడ్‌ను పక్కనబెట్టాలి. ప్రోటీన్లను మితంగా తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవడం చేయాలి. ఇలా చేస్తే నెలసరి నొప్పులకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే గోరువెచ్చని నీటిని రోజంతా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చు. గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా... ఇంకా గోరువెచ్చని వేడి నీటిలో నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కాస్త వేడిగా ఉన్న నీళ్లు తాగడం వల్ల ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువగా వస్తుంది. దీని ద్వారా ఎక్కువ క్రిములు బయటికి పోయే అవకాశం ఉంటుంది. గోరువెచ్చని నీటితో వృద్ధాప్యఛాయలు తగ్గిపోతాయి. చర్మఛాయ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.