శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By chj
Last Modified: సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (21:36 IST)

శృంగారంలో మెప్పించేందుకు పురుషులు నానా తంటాలు... ఇదే చిట్కా

జీవిత భాగస్వామిని శృంగారంలో మెప్పించేందుకు పురుషులు నానా తంటాలు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు విఫలమవుతారు. ఒక సర్వేలో తేలిన భయంకరమైన విషయమేమిటంటే ఇండియాలో 58శాతం మంది పురుషులు వారి భార్యలకు కావల్సిన శృంగారాన్ని అందించడంలో విఫలమవుతున

జీవిత భాగస్వామిని శృంగారంలో మెప్పించేందుకు పురుషులు నానా తంటాలు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు విఫలమవుతారు. ఒక సర్వేలో తేలిన భయంకరమైన విషయమేమిటంటే ఇండియాలో 58శాతం మంది పురుషులు వారి భార్యలకు కావల్సిన శృంగారాన్ని అందించడంలో విఫలమవుతున్నారట. భార్యలో శృంగారంలో అయితే భర్త పాల్గొంటున్నాడు కానీ పూర్తి సంతృప్తి ఇవ్వడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడట.
 
ఎక్కువ శాతం మంది పురుషులు శీఘ్రస్ఖలనం సమస్యతో భాదపడుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నివారణకు కొందరు టాబ్లెట్లు కొందరు వయాగ్రా కొందరు మద్యం తీసుకుంటున్నారు. ఇలా చేస్తే ఈ సమస్య నుండి బయటపడినట్లు భావిస్తారు కానీ దీర్ఘకాలంగా ఉన్న శృంగార సమస్యను దూరం పెట్టాలి అంటే ఆహారంలో కొన్నింటిని రెగ్యులర్‌గా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 
 
శృంగార సామర్ధ్యం పెంచే వాటిలో మునగకాయ ముఖ్యమైనదన్న విషయం తెలిసిందే. ఆడ, మగ ఇద్దరూ ప్రతిరోజు లేదా రెండు రోజులకొకసారైనా మునగకాయను, మునగాకుని కూరలాగా చేసుకుని తినడం వల్ల శృంగార విషయంలో మంచి ఫలితం ఉంటుంది. మునగ తరువాత శృంగార సామర్ధ్యాన్ని పెంచేది ఖర్జూరం. ఎండు ఖర్జూరం లేదా సాధారణ ఖర్జూరం ఏదైనా మనిషిలో అద్భుతాలను సృష్టిస్తాయి. మనిషి శరీరానికి సత్వరమైన శక్తిని ప్రసాదిస్తుందని డాక్టర్లు ఖర్జూరాన్ని తినమని సిఫారస్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు, నీరసంతో ఉన్నప్పుడు, రక్తం పెరుగుదలకు, రక్తప్రసరణ బాగా ఉండేందుకు ఖర్జూరం బాగా పని చేస్తుంది. 
 
ఎండు ఖర్జూరం లేదా సాధారణ ఖర్జూరం పండును తేనెలో రెండు గంటల పాటు నానబెట్టి ఆ తరువాత తింటే అద్బుతమైన శృంగార సామర్ధ్యం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తేనెలో నానాబెట్టి  తీసుకోవడం వల్ల వారం నుండి పది రోజుల్లో శీఘ్రస్ఖలనం సమస్యకు గుడ్ బై చెప్పి భాగస్వామికి సంతోషం కలిగించేలా శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిని నిపుణులు ప్రయోగం చేసి నిరూపితం చేసినది. శృంగార సామర్ధ్యం పెంచుకోవడానికి లేనిపోని మందులు వాడి ఆరోగ్యాన్ని పాడుచేసుకునేకంటే ఖర్జూరం తినడం వల్ల సామర్ధ్యం పెరగడంతో పాటు ఆరోగ్యానికి అన్నివిధాల మంచిది.