శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (18:50 IST)

నలుపుగా మారిన పెదవులను రోజా రేకుల్లా మార్చాలంటే?

పెదవులకు లిప్ బామ్స్‌ వాడుతున్నారా? లిప్ స్టిక్కులు వాడుతున్నారా? వాటిని ఇక ఆపేయండి. ఎందుకంటే వాటిలోని రసాయనాలు పెదవులను నలుపుగా మార్చేస్తాయి. అందుకే పెదవులు నల్లబారకుండా వుండాలంటే.. నలుపు తిరిగిన పెద

పెదవులకు లిప్ బామ్స్‌ వాడుతున్నారా? లిప్ స్టిక్కులు వాడుతున్నారా? వాటిని ఇక ఆపేయండి. ఎందుకంటే వాటిలోని రసాయనాలు పెదవులను నలుపుగా మార్చేస్తాయి. అందుకే పెదవులు నల్లబారకుండా వుండాలంటే.. నలుపు తిరిగిన పెదవులు రోజా రేకుల్లా తయారవ్వాలంటే.. ఈ చిట్కాలు పాటించండి. అలొవెరా గుజ్జును రోజూ రాసుకుంటే చాలు. ఇందులోని పాలీఫినాలిక్‌ ఆమ్లాలు పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తాయి. అందులోని పోషకాల కారణంగా పెదాలు మృదువుగా మారుతాయి. 
 
అలాగే టేబుల్‌స్పూను నిమ్మరసంలో టేబుల్‌స్పూను తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి ఓ గంటసేపు ఉంచాలి. తరవాత మెత్తని తడిబట్టతో తుడిచేయాలి. ఇలా రోజుకి కనీసం మూడుసార్లు చేయాలి. నిమ్మరసం వల్ల పెదవుల నలుపు రంగు పోతుంది. తేనె వల్ల పెదవులు మృదువుగా తయారవుతాయి. 
 
అలాకాకుంటే కాటన్ బడ్‌తో గ్లిజరిన్‌ను పెదవులకు రాసి నిద్రించాలి. ఇలా చేస్తే పెదవులు మృదువుగా తయారవుతాయి. నల్లబడిన పెదాలకు ఆపిల్‌ సిడార్‌ వినెగర్‌ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. టీస్పూను వినెగర్‌లో టీస్పూను నూనె కలిపి దాన్ని దూది సాయంతో పెదాలకు పట్టించి, పది నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మంచిదని.. తద్వారా పెదవులు రోజా రేకుల్లా తయారవుతాయని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు.