శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (13:57 IST)

కీరదోస నీళ్లు తాగితే పొట్ట ఇట్టే కరిగిపోతుంది.. తెలుసా?

కీరదోస నీళ్లను వేసవికాలంలో రోజూ ఆరు గ్లాసులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కీరదోస నీళ్లను రోజూ తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య రాకుండా వుంటుంది. కీరదోస శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కీర

కీరదోస నీళ్లను వేసవికాలంలో రోజూ ఆరు గ్లాసులు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కీరదోస నీళ్లను రోజూ తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య రాకుండా వుంటుంది. కీరదోస శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కీరను పలుచని ముక్కలుగా కట్ చేసుకుని.. అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. నీళ్లలో కీర ముక్కలను రోజుకంటే ఎక్కువ వుంచకూడదు. కావాలనుకుంటే రుచి కోసం నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ నీటిని తాగిన తర్వాత కీరదోస ముక్కల్ని కూడా తినేయవచ్చు. 
 
కీరదోస నీటిని సేవించడం ద్వారా చర్మం ఆరోగ్యంగా వుంటుంది. ఈ నీరు బరువు తగ్గించడంలో భేష్‌గా పనిచేస్తుంది. ఆకలిగా వున్నప్పుడు కీరదోస నీటిని సేవిస్తే పొట్టనిండిన భావన కలుగుతుంది. ఈ నీటిలో పుష్కలంగా వుండే విటమిన్-కె, మాంసకృత్తులు, ఎముకలకు బలాన్నిస్తాయి. 
 
కీరదోస నీరు నోటి దుర్వాసనను తొలగిస్తాయి. నోటి బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. కీరలోని యాంటీయాక్సిడెంట్లు, విటమిన్ సి, బీటాకెరోటిన్ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. వేసవిలో కీరదోస నీరు తాగిస్తే నీటి దాహం తగ్గుతుంది. కీరలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు, అల్జీమర్స్, కంటి దృష్టి లోపాలను దూరం చేస్తుంది. ఇంకా చర్మానికి కీర ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.