శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 మార్చి 2018 (15:19 IST)

బొల్లివ్యాధిని తగ్గించే జీడిపప్పు..

బొల్లివ్యాధిని తగ్గించడంలో జీడిపప్పు ఉపయోగపడుతుంది. ఈ వ్యాధిగ్రస్థులు రోజూ తగినంత జీడిపప్పు తింటూ.. జీడినూనెను మచ్చలపై రాయడం ద్వారా చర్మం సహజ రంగుకు మారుతుంది. బొల్లితో పాటు ఇతర చర్మ వ్యాధులను కూడా జీ

బొల్లివ్యాధిని తగ్గించడంలో జీడిపప్పు ఉపయోగపడుతుంది. ఈ వ్యాధిగ్రస్థులు రోజూ తగినంత జీడిపప్పు తింటూ.. జీడినూనెను మచ్చలపై రాయడం ద్వారా చర్మం సహజ రంగుకు మారుతుంది. బొల్లితో పాటు ఇతర చర్మ వ్యాధులను కూడా జీడిపప్పు నూనె తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రోజూ తగినంత జీడిపప్పు తింటే, అధిక రక్తపోటు సమస్య అదుపులోకి వస్తుంది. 
 
అలాగే ఇనుము పుష్కలంగా వుండే జీడిపప్పు రక్తంలోని హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. రక్తహీనతకు చెక్ పెట్టాలంటే రోజు నాలుగేసి జీడిపప్పులు తీసుకోవడం మంచిది. అయితే జీడిపప్పును మితంగా తీసుకోవాలి. 
 
ఇకపోతే.. లైంగిక పటుత్వం కోసం జీడిపప్పు భేష్‌గా పనిచేస్తుంది. ఇది వీర్యకణాలను పెంచుతుంది. జీడిపప్పును రోజూ తింటే నపుంసకత్వం కూడా తొలగిపోతుంది. ప్రతిరోజూ పరగడుపున కొద్దిగా జీడిపప్పు, తేనెతో తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.