శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (17:20 IST)

వేసవిలో వడదెబ్బకు చెక్ పెట్టాలంటే.. సబ్జానీళ్లు తాగండి..

వేసవిలో వడదెబ్బకు చెక్ పెట్టాలంటే.. సబ్జానీళ్లు తాగటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధికంగా నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరం డీ-హైడ్రేట్ కాదు. అందుకే సబ్జా సీ

వేసవిలో వడదెబ్బకు చెక్ పెట్టాలంటే.. సబ్జానీళ్లు తాగటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధికంగా నీటిని సేవించడం ద్వారా  ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరం డీ-హైడ్రేట్ కాదు. అందుకే సబ్జా సీడ్స్‌ను ఇలా ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వేసవి వేడి నుంచి తప్పించుకోవాలంటే సబ్జాగింజలు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. అందులో కాస్తంత నిమ్మరసాన్ని కలిపి తాగితే చాలు. శరీరాన్ని చల్లబరచడమే కాదు, బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ  నీటిని రోజుకు మూడు నాలుగు సార్లు వేసవిలో తీసుకుంటే వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. 
 
అలాగే వేసవిలో గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే... శరీరం చల్లగా ఉంటుంది. ఇక ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే వేసవిలో ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు, మజ్జిగలో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. విటమిన్లూ, పోషకపదార్ధాలున్న పెరుగును వేసవి కాలంలో అధికంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.