బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 24 మార్చి 2018 (17:06 IST)

17ఏళ్ల అత్యాచార బాధితురాలు.. 40 బీపీ ట్యాబ్లెట్లు మింగేసింది..

అత్యాచార బాధితుల పరిస్థితి దీనంగా మారిపోతుంది. అత్యాచారానికి గురైన యువతులను సమాజం చిన్నచూపు చూడటం, వారిపై మగాళ్లు చూపు వేరేలా వుంటోంది. దీంతో అత్యాచార బాధితులు నానా తంటాలు పడుతున్నారు. ఈ వేధింపులు, ఛీ

అత్యాచార బాధితుల పరిస్థితి దీనంగా మారిపోతుంది. అత్యాచారానికి గురైన యువతులను సమాజం చిన్నచూపు చూడటం, వారిపై మగాళ్లు చూపు వేరేలా వుంటోంది. దీంతో అత్యాచార బాధితులు నానా తంటాలు పడుతున్నారు. ఈ వేధింపులు, ఛీత్కారాలు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాదులో 17ఏళ్ల అత్యాచార బాధితురాలు 40 బీపీ టాబ్లెట్లను మింగేసింది. 
 
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మెట్టుగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 17ఏళ్ల అత్యాచార బాధితురాలు నామాలగుండులోని తన అమ్మమ్మ ఇంటికి గురువారం వచ్చింది. అదేరోజు సాయంత్రం ఇంట్లోని 40 బీపీ ట్లాబ్లెట్లు మింగేసింది. 
 
వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన బాధితురాలు.. శుక్రవారం ప్రాణాలు విడిచింది. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద అత్యాచార కేసును నమోదు చేశారు. కాగా ఈ నెల 13వ తేదీన సదరు బాలికను మహ్మద్ అస్లాం (21) అనే యువకుడు అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని.. అతడి కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.