గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (10:28 IST)

చెల్లిపై ఫ్రెండ్ అత్యాచారం.. చూసి ఖంగుతిన్న అన్న

తన ఫ్రెండే కదా అని ఇంట్లోకి వచ్చేందుకు అనుమతిస్తే ఏకంగా చెల్లిపైనే అత్యాచారం చేశాడు. అలా అత్యాచారం చేయడాన్ని కళ్ళారా చూసిన అన్న ఖంగుతిన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ మీర్‌చౌక్‌ ఏసీపీ డివిజన్‌ పరిధిలోని రెయిన్

తన ఫ్రెండే కదా అని ఇంట్లోకి వచ్చేందుకు అనుమతిస్తే ఏకంగా చెల్లిపైనే అత్యాచారం చేశాడు. అలా అత్యాచారం చేయడాన్ని కళ్ళారా చూసిన అన్న ఖంగుతిన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ మీర్‌చౌక్‌ ఏసీపీ డివిజన్‌ పరిధిలోని రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యాఖుత్‌పురా సెగ్మెంట్‌ చంచల్‌గూడ బస్తీకి చెందిన బాలుడు(17) అదే బస్తీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి వేళ్లేవాడు. తెలిసిన బాలుడే కదా అని అతడిని ఇంటికి రానిచ్చేవారు. 
 
ఇలా రోజూ వచ్చి బాలిక(12)కు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని అఘాయిత్యానికి పాల్పడుతుండేవాడు. రోజూ మాదిరిగానే బుధవారం బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన బాలిక అన్న సంఘటనను చూసి ఖంగుతిన్నాడు. అతడిని పట్టుకుని అడిగేలోపు అక్కడి నుంచి పారిపోయాడు. 
 
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబసభ్యులను చంపుతానని బెదిరించేవాడని బాలిక ఏడుస్తూ చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. పోలీసులు బాలుడిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా వారి ఆదేశాల మేరకు అతడిని జువైనల్‌ హోంకు తరలించారు.