శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (11:56 IST)

పుట్టింటి నుంచి డబ్బు తెస్తేనే నీతోగడుపుతా... తేల్చి చెప్పిన భర్త : రేప్ కేసు పెట్టిన భార్య

పుట్టింటి నుంచి లక్ష రూపాయలు తెస్తేనే కాపురం చేస్తానన్న భర్తకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్న ఆ భార్య.. కట్టుకున్న భర్తపై అత్యాచారం కేసు పెట్టింది. బెంగుళూరులో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్త

పుట్టింటి నుంచి లక్ష రూపాయలు తెస్తేనే కాపురం చేస్తానన్న భర్తకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్న ఆ భార్య.. కట్టుకున్న భర్తపై అత్యాచారం కేసు పెట్టింది. బెంగుళూరులో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తేృ, 
 
బెంగుళూరు నగరంలోని మహేశ్వరం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు దేవ్‌ కుమార్‌ అనే వ్యక్తితో గత తొమ్మిదేళ్ళ క్రితం వివాహమైంది. ఈయన ఓ ప్రవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి పిల్లలు లేకపోవడంతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో గత నాలుగేళ్లుగా వేర్వేరుగా నివశిస్తున్నారు. 
 
అదేసమయంలో మహిళతో దేవ్‌కుమార్‌ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ విషయం అసలు భార్యకు ఇటీవలే తెలిసింది. భర్తను నిలదీయటంతో పుట్టింటి నుంచి రూ.లక్ష నగదు తీసుకు వస్తేనే నీతో సంసారం చేస్తానని తెగేసి చెప్పాడు. 
 
అంతే.. భర్తకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయానికి వచ్చిన ఆ మహిళ... తనను బెదిరించి భర్త తన కామవాంఛ తీసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచిత్రమైన ఈ ఘటన వివరాలు తెలుసుకుని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై భార్యాభర్తలిద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు.