గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 4 ఏప్రియల్ 2018 (10:11 IST)

మండే ఎండల్లో మాంసాహారం వద్దు.. మసాలాలు వద్దే వద్దు..

మండే ఎండల్లో అజీర్తికి కారణమయ్యే ఆహారాన్ని పక్కనబెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా

మండే ఎండల్లో అజీర్తికి కారణమయ్యే ఆహారాన్ని పక్కనబెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా తేమ శరీరాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా మండే ఎండల్లో కారాన్ని బాగా తగ్గించాలి. మసాలాల మోతాదును కూడా బాగా తగ్గిస్తే మంచిది. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటును మందిగించేందుకు కారణమవుతుంది.
 
అలాగే వేసవిలో మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్ వంటివి తీసుకుంటే అజీర్తి సమస్యలకు కారణమవుతాయి. ఒకవేళ చికెన్, మటన్ లాగిస్తే నీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేదంటే శరీరంలో వుండే తేమను మాంసాహారం హరించివేసి డీ-హైడ్రేషన్ బారిన పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంకా నూనెలో వేయించిన ఆహారాన్ని బాగా తగ్గించాలి. వేపుళ్లు, ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిని దూరంగా ఉంచాలి. వీటిని తీసుకుంటే వికారం, అతిగా దాహం ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.