శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 2 ఏప్రియల్ 2018 (21:34 IST)

జీలకర్ర తైలంలో ఉప్పు కలిపి వంటికి రాసుకుంటే...

ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటిందంటే ఒంటి నొప్పులతో బాధ పడేవారు ఎక్కువ. ఇలాంటి నొప్పులను తగ్గించడానికి మన వంటగదిలో వస్తువులను ఉపయోగించాలి. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తింటే వీపు నొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి. వెల్లుల్లి-నువ్వుల నూనెతో తయా

ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు దాటిందంటే ఒంటి నొప్పులతో బాధ పడేవారు ఎక్కువ. ఇలాంటి నొప్పులను తగ్గించడానికి మన వంటగదిలో వస్తువులను ఉపయోగించాలి. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని తింటే వీపు నొప్పి, నడుము నొప్పి తగ్గుతాయి. వెల్లుల్లి-నువ్వుల నూనెతో తయారుచేసిన తైలాన్ని నొప్పి వున్న చోట రాసిన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
1. పొన్నగంటి కూర వేరు రసాన్ని నుదుటకి పూస్తే తలనొప్పి తగ్గుతుంది. సీతాఫలం ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
2. కర్పూరాన్ని కొబ్బరినూనెతో కలిపి కీళ్ల నొప్పులు ఉన్నచోట రాస్తే చాలా త్వరితంగా సాంత్వన లభిస్తుంది. 
 
3. అడవి గోరింట కషాయాన్ని కొద్దికాలం పాటు తీసుకుంటే తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. జీలకర్ర తైలంలో ఉప్పు కలిపి వంటికి రాసుకుంటే అన్ని రకాల వంటినొప్పులు తగ్గుతాయి. 
 
4. పత్తి గింజలను వేయించి పొట్టు తీసి తింటే పంటి నొప్పి, నరాల బలహీనత తగ్గుతాయి.