బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (21:58 IST)

ముదిరిన బూడిద గుమ్మడికాయతో హల్వా చేసుకుని తింటే...?

మనకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. ఉదాహరణకు చూస్తే... 1. పెద్ద ఉసిరికాయలోని గింజను తీసివేసి, బాగా దంచి ఆ పిప్పిని నేతిలో వేయించి, కొద్దిగా నీళ్లు కలిపి పేస్టుగా తయారుచేసి భద్రపరుచుకోవాలి. ముక్కు నుండి రక్తస్రావం అవ

మనకు ప్రకృతి ప్రసాదించిన వాటిలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి వున్నాయి. ఉదాహరణకు చూస్తే... 
 
1. పెద్ద ఉసిరికాయలోని గింజను తీసివేసి, బాగా దంచి ఆ పిప్పిని నేతిలో వేయించి, కొద్దిగా నీళ్లు కలిపి పేస్టుగా తయారుచేసి భద్రపరుచుకోవాలి. ముక్కు నుండి రక్తస్రావం అవుతున్నప్పుడు ఈ పేస్టును తలకు మందంగా పట్టిస్తే వెంటనే ఆగిపోతుంది.
 
2. మోదుగ చెట్టు బెరడును మెత్తగా నూరి, పంచదారను కలిపి తింటే శరీరంలోని ఏ అవయవం నుంచి రక్తం కారుతున్నా ఆగిపోతుంది.
 
3. బాగా ముదిరిన బూడిద గుమ్మడికాయతో హల్వా చేసుకుని తింటూ ఉంటే రక్తస్రావాలు ఆగిపోతాయి. బూడిద గుమ్మడికాయను సొరకాయను వండినట్టు వండుకుని తినడం వల్ల రక్తస్రావాలు ఆగిపోతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 
4. ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష ఈ రెంటిని మెత్తగా నూరి తగినంత తేనె కలిపి ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం ఒక చెంచా చొప్పున తీసుకుంటూ ఉంటే అన్ని రకాల రక్తస్రావాలు ఆగిపోతాయి.