మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (22:54 IST)

తల్లి అయ్యేందుకు మందులెందుకు... ఇవి తీసుకుంటే చాలు...

గుమ్మడితో కూర, పులుసు, సూప్... వంటివి చేసుకుంటాం. ఇది కేవలం రుచి మాత్రమే కాదు. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే... 1. తల్లి కావాలనుకునే వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది

గుమ్మడితో కూర, పులుసు, సూప్... వంటివి చేసుకుంటాం. ఇది కేవలం రుచి మాత్రమే కాదు. ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే...
 
1. తల్లి కావాలనుకునే వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్-ఎ శరీరంలో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యతను రాకుండా కాపాడుతుంది.
 
2. విటమిన్-సి అందించే కూరగాయల్లో గుమ్మడి ఒకటి. ఇది శరీరంలోని వ్యాది నిరోదక శక్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
 
3. ఇందులో యాంటీ ఆక్సీడెంట్లు, విటమిన్-ఇ, బీటాకెరొటిన్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటిచూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చేస్తాయి. కంటీ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడితో చేసిన వంటకాలు తినిపించడం ఎంతో మంచిది.
 
4. గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు, విటమిన్-సి గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.
 
5. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజలను తినడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడంతో ఒత్తిడి తగ్గి అలసట దూరమయ్యి సుఖ నిద్ర పడుతుంది.