మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (10:05 IST)

వేసవిలో పెరుగు తప్పనిసరి.. చెమటకు చెక్ పెట్టాలంటే... గుమ్మడి గింజల్ని?

వేసవిలో పెరుగు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగును బాగా చిలక్కొట్టి చక్కెర, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలు కలపాలి. ఈ మిశ్రమంలో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వేసవి కాలంలో రోజుకు

వేసవిలో పెరుగు తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగును బాగా చిలక్కొట్టి చక్కెర, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలు కలపాలి. ఈ మిశ్రమంలో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వేసవి కాలంలో రోజుకు రెండు మూడు కప్పులు తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ బారిన పడదు. అలాగే రోటీలు, చపాతీలు చేసేటప్పుడు మెత్తగా రావాలంటే.. చపాతీ పిండి కలిపేటప్పుడు పెరుగు కలిపాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చేకూరుతుంది.
 
అలాగే వేసవిలో మంచి నీళ్లు బాగా తాగాలి. తేలికపాటి పోషకాహారం తీసుకోవాలి. తినే ఆహారంలో 'బి' విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అరటి పండ్లు, గుడ్లు, ఆకుపచ్చని ఆకుకూరలు రోజూవారీ డైట్‌లో వుండాలి. ఎండాకాలంలో చెమటను తగ్గించాలంటే విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.
 
అలాగే పాలు, క్యారెట్‌, ఆకుకూరలు, చేపలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. వేయించిన గుమ్మడి గింజల్లో, ఎండిన పుచ్చకాయ గింజల్లో జింక్‌ ఎక్కువగా దొరుకుతుంది. ఇవి నోటి దుర్వాసనను, చెమట దుర్వాసనను పోగొడుతాయి. అందుకే వేసవిలో రోజూ పది గ్రాముల గుమ్మడి గింజలని తింటే.. శరీరానికి తగిన జింక్ లభించినట్లవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.