శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By selvi
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:32 IST)

వేసవికాలం: బాలింతలు శిశువులకు నీరు కూడా తాగించాలట?

బాలింతలు శిశువులకు పాలు పట్టి నిద్రపెట్టేయడం చేస్తుంటారు. ఈ పద్ధతి వానాకాలం, శీతాకాలంలో ఓకే కానీ.. వేసవి కాలంలో మాత్రం కూడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. అప్పుడే పుట్టిన శిశువులు,

బాలింతలు శిశువులకు పాలు పట్టి నిద్రపెట్టేయడం చేస్తుంటారు. ఈ పద్ధతి వానాకాలం, శీతాకాలంలో ఓకే కానీ.. వేసవి కాలంలో మాత్రం కూడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే.. అప్పుడే పుట్టిన శిశువులు, ఆరు నెలలు కూడా నిండని పాపాయి, ఐదేళ్లు నిండిన చిన్నారుల పట్ల వేసవి కాలంలో అధిక శ్రద్ధ తీసుకోవాలి. వారికి అప్పుడప్పుడు ద్రవపదార్థాలను ఇస్తుండాలి. నీరు, జ్యూస్‌లు, నీటిశాతం గల పండ్లు ఇవ్వడం ద్వారా చిన్నారులను డీ-హైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. 
 
పాలుపట్టిన తర్వాత శిశువులను వెంటనే నిద్రిపుచ్చకుండా.. ఐదు నిమిషాల తర్వాత రెండు లేదా మూడు స్పూన్లు తాగించి.. రెండు నిమిషాల తర్వాత నిద్రపుచ్చాలి. మాసాలు నిండని శిశువులకు మూడు గంటలకోసారి పాలు పట్టాలి. తల్లిపాలలో తగిన శాతం నీరున్నప్పటికీ.. అదనంగా రెండు స్పూన్లు లేదా అరగ్లాసుడు నీరును అప్పుడప్పుడు శిశువులకు ఇస్తుండాలి. 
 
ఇలా చేయడం ద్వారా ఎండల్లో పిల్లల్లో దాహం వుండదు. అయితే చిన్నారులకు ఇచ్చే నీటిని కాచి వడగట్టి ఆరబెట్టిన తర్వాత గోరు వెచ్చగా వున్నప్పుడు ఇవ్వాలి. ఇలా చేస్తే శిశువుల్లో అజీర్తి సమస్య ఏర్పడదని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.