నాగపంచమి రోజున నాగేంద్రునిని ఇలా పూజిస్తే?
శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా చెప్పబడుతోంది. ఈ రోజున నాగేంద్రుడిని పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలా లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. వైకుంఠంలో శ్రీమహావిష్ణువు శేష పాన్పుపై శయనముద్రలో ద
శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా చెప్పబడుతోంది. ఈ రోజున నాగేంద్రుడిని పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలా లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. వైకుంఠంలో శ్రీమహావిష్ణువు శేష పాన్పుపై శయనముద్రలో దర్శనమిస్తుంటారు. పరశివుడు కైలాసంలోనే కాకుండా ఎక్కడికి వెళ్లినా కంఠాభరణంగా సర్పరాజు కనిపిస్తుంటాడు.
శివకేశవులు నాగజాతికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన కారణంగానే వారికి దేవతా స్థానం లభించింది. పంటలకు హానిచేసే క్రిమికీటకాలను సర్పాలు ఆహారంగా తీసుకుంటుంటారు. అందువలన ఇవి విషబాధలు కలుగకుండా చూడమని పల్లె ప్రజలు నాగదేవతను పూజిస్తుంటారు. చాలామంది సర్పదోషతాలతో బాధపడుతుంటారు. అలాంటి వారు నాగపంచమి రోజున నాగదేవతను ఆరాధిస్తే అలాంటి దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్పబడుతోంది.
శ్రావణ శుద్ధ పంచమి రోజున పూజా మందిరంలో నాగేంద్రుడి చిత్రపటాన్ని గానీ, అయిదు పడగలు కలిగిన సర్ప ప్రతిమను గానీ ఏర్పాటు చేసుకుని పంచామృతాలతో అభిషేకించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఎర్రని పువ్వులతో పూజించి పాలు, నువ్వుల పిండిని, చలిమిడిని నాగరాజుకి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది.
తెలియకుండా సర్పాలకి హాని చేసి సర్పదోషం బారిన పడినవాళ్లు ఈ నాగాపంచమి రోజున నాగారాధన తప్పకచేయాలి. నాగుల పట్ల కృతజ్ఞతతో ఈ రోజున రైతులు భూమిని దున్నకుండా ఉండాలి. నాగరాజుని పూజించిన తరువాత చలిమిడిని నైవేద్యంగా సమర్పించడం వలన ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా దక్కుతుందని చెప్పబడుతోంది.