శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 30 జులై 2018 (14:10 IST)

ఆలయ నిర్మాణంలో వాస్తు దోషాలను సరిచేస్తున్న పరమశివుడు...

భక్తులను అనుగ్రహించడం కోసమే దివి నుండి భువికి దిగివచ్చిన దేవుడు శివుడు. భక్తుల ద్వారా వెలుగును చూసిన శైవ క్షేత్రం కర్నూలు జిల్లా అక్కంపల్లి సమీపంలో ఉంది. సాధారణంగా కలలో దేవుడు కనిపించడం, భగవంతుడు తన ఆ

భక్తులను అనుగ్రహించడం కోసమే దివి నుండి భువికి దిగివచ్చిన దేవుడు శివుడు. భక్తుల ద్వారా వెలుగును చూసిన శైవ క్షేత్రం కర్నూలు జిల్లా అక్కంపల్లి సమీపంలో ఉంది. సాధారణంగా కలలో దేవుడు కనిపించడం, భగవంతుడు తన ఆచూకీని తెలిపి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. భక్తులు నిర్మిస్తోన్న ఆలయాన్ని స్వామి దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాస్తు దోషాలను సరిచేసిన సంఘటన ఈ క్షేత్రంలో కనిపిస్తుంటుంది.
 
చెన్నబసప్ప అనే భక్తుడు స్వామివారి ఆదేశం మేరకు ఇక్కడి కొండపై ఆలయాన్ని నిర్మించడం మెుదలుపెడతాడు. తన భార్యతో సహా కొంతమంది కూలీలు కూడా ఈ పనిలో పాల్గొనేవాళ్లు. రోజంతా కష్టపడి పనిచేసి ఈ కొండపైనే నిద్రించేవారు. మరుసటి రోజు పనిలోకి వెళ్లిన వాళ్లకి అంతకు ముందురోజు వాళ్లు చేసిన పనికి సంబంధించిన మార్పులు కనిపించడంలో ఆశ్చర్యపోతారు. ఈ మార్పులు ఎవరు చేస్తున్నారో వాళ్లకి అర్థంకాలేదు.
 
అలాంటి పరిస్థితుల్లో చెన్నబసప్ప భార్యకి ఒక రాత్రి ఏదో అలికిడి వినిపించిదట. ఆ అలికిడితో లేచి చూసిన ఆమెకు శివుడు ఆయన గణాలు ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను సరిచేస్తు కనిపించారట. ఆ దృశ్యాన్ని చెన్నబసప్పకు ఆమె చూపించింది. అలా ఇక్కడి ఆలయ నిర్మాణఁ పరమశివుడి పర్యవేక్షణలోనే జరిగిందని పురాణంలో చెప్పబడుతోంది. శివుడు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న కారణంగా ఈ క్షేత్రం మహిమాన్వితమైననదిగా చెప్పబడుతోంది.