శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By Kowsalya
Last Updated : శనివారం, 14 జులై 2018 (18:30 IST)

ఇంటి నిర్మాణానికి వాస్తు చిట్కాలు.....

ఇంటి నిర్మాణానికి వాస్తు చిట్కాలు. ఇంటిని దక్షిణ, తూర్పు దిశగా అమర్చుకోవాలి. నీటి నిర్మాణం భూవిు క్రింద భాగంలో ఉండకూడదు. అది ఇళ్లు లేదా ఆఫీసు కావొచ్చు. డబ్బు లాకర్‌ను దక్షిణ, తూర్పు దిశలో మూసేట్లుగా ఉ

ఇంటి నిర్మాణానికి వాస్తు చిట్కాలు. ఇంటిని దక్షిణ, తూర్పు దిశగా అమర్చుకోవాలి. నీటి నిర్మాణం భూవిు క్రింద భాగంలో ఉండకూడదు. అది ఇళ్లు లేదా ఆఫీసు కావొచ్చు. డబ్బు లాకర్‌ను దక్షిణ, తూర్పు దిశలో మూసేట్లుగా ఉండాలి. అప్పుడే తెరిచే తలుపులు ఉత్తర దిశగా ఉంటాయి. ఇలా అమర్చుకోవడం వలన మీరు ధనవంతులవుతారు.
 
ఉత్తర దిశలో డబ్బు లాకర్‌ను తెరిచేలా చూసుకోవాలి. ఎప్పుడూ ఉత్తర దిశలో తప్ప ఇతర దిశలలో డబ్బులను ఉంచకూడదు. డబ్బు లాకర్‌కి ఎదురుగా అద్దం ఉంటే అవి రెండు రెట్లు అధికమయ్యేందుకు అవకాశం ఉంది. యంత్రాలను ఉత్తర దిశలో ఉంచకూడదు.
 
ఉత్తర దిశలో ఉండే ఇంటిని గాని ప్లాట్లను గాని కొనుక్కోకూడదు. గుడి నీడ ఇంటిమీద కాని, ప్లాట్లమీద కాని పడకూడదు. ఇంటి పైకప్పు భాగం ఉత్తర, పడమర దిశలో ఉండవలెను.