1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. honey and coconut oil beauty tips for shoulders

వీపువై మెుటిమలు తొలగిపోవడానికి? తేనెను రాసుకుంటే?

కొంతమందికి వీపు మీద చిన్న చిన్న మెుటిమలు లేదంటే దద్దుర్లు లాంటివి వస్తుంటాయి. దానికి పరిష్కారంగా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా దీనికి కొన్నిసార్లు కార

shoulders
కొంతమందికి వీపు మీద చిన్న చిన్న మెుటిమలు లేదంటే దద్దుర్లు లాంటివి వస్తుంటాయి. దానికి పరిష్కారంగా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా దీనికి కొన్నిసార్లు కారణం కావొచ్చు. శరీరంలో వచ్చే మార్పులకు మన చర్మం తొందరగా స్పందిస్తుంది. అలాంటి మార్పు వస్తే వెంటనే గమనించాలి.
 
చిరుతిళ్లు ఎక్కువగా తింటున్నట్లైతే మానేసి తాజా కూరగాయలు, మాంసకృతులు ఉండే ఆహారం అధికంగా తీసుకుంటే మంచిది. కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడం వలన వీపును అలా కుర్చీకి ఆనించి ఉంచుతాం. ఇది కూడా ఒక కారణం కావొచ్చు. అందుకే పని మధ్యలో అప్పుడప్పుడు తప్పనిసరిగా విరామం ఉండేలా చూసుకోవాలి.
 
సాయంత్రం వ్యాయామం చేసిన తరువాత స్నానం మానకూడదు. లేదంటే చెమట వలన కూడా ఈ సమస్య పెరిగి అవకాశం ఉంది. చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. జుట్టు ఎక్కువుగా వీపు భాగానికి తగలడం వలన కూడా ఈ సమస్య ఎక్కువవుతుంది. పొడవు జుట్టు ఉన్నవాళ్లు జుట్టు ముందు వైపునకు వేసుకుంటే మంచిది.
 
కొబ్బరినూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు మొటిమల్ని తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు చిన్న దూది ఉండను కొబ్బరినూనెలో ముంచి రాసుకోవాలి. ఉదయాన్నే కడిగేస్తే చాలు. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. తేనె కూడా దీనికి మంచి పరిష్కారం. తేనెను ఆ భాగంలో రాసుకుని అరగంట తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనిలో ఉండే సహజగుణాలు సమస్య తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
బాదం ఆకులతో.. చర్మ సమస్యలు మటాష్