Differences with Prasanth Varma :దర్శకుడితో విభేదాలు - హనుమాన్ ఫ్రాంచైజీ రెండు వేర్వేరు గా విడిపోయింది
Jai Hanuman - Hanuman 2
నిన్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పై బిగ్ అప్ డేట్ ఇస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దాని సారాంశం నేడు విడుదల చేశారు. హనుమాన్ ఒరిజినల్ నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్, ఇప్పుడు వేరే దర్శకుడితో పంజ వైష్ణవ్ తేజ్ హీరోగా ఆ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి హనుమాన్ 2 అని పేరు పెట్టారు.
ఒకే ఫ్రాంచైజీ నుండి రెండు వేర్వేరు సీక్వెల్స్.రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ముందు ముందు ఆసక్తికరమైన విషయాలు రానున్నాయి.
ఒరిజినల్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సృజనాత్మక విభేదాలు తలెత్తాయనే వార్తల నేపథ్యంలో, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ నవంబర్ 21న పంజా వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా, వి. ఆనంద్ దర్శకత్వంలో 'హనుమాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరస్' చిత్రాన్ని ప్రకటించింది. వర్మ, రిషబ్ శెట్టి నటిస్తున్న 'జై హనుమాన్' చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ వైపు వెళ్లగా, నిర్మాతలు తమ విజన్‌తో ముందుకు సాగుతున్నారు. కష్టకాలం తర్వాత లార్డ్ హనుమాన్ ప్రాజెక్ట్‌తో తిరిగి వస్తున్న వైష్ణవ్ తేజ్‌కు నటుడు సాయి ధరమ్ తేజ్ హృదయపూర్వక మద్దతు అందించగా, ఈ పౌరాణిక సూపర్ హీరో విశ్వం ఈ రెండు మార్గాలూ విస్తరించడాన్ని అభిమానులు గమనిస్తున్నారు.
దానికి తోడు హీరో పంజా వైష్ణవ్ తేజ్ ని హీరోగా పెట్టి హను మాన్ 2 అంటూ ఓ ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడం ఆసక్తిగా మారింది. ఇక్కడ మరో బిగ్ అండ్ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే టాలెంటెడ్ దర్శకుడు వి ఐ ఆనంద్ ఫాంటసీ సినిమాగా దీన్ని అనౌన్స్ చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కోరాజా, ఒక్క క్షణం లాంటి క్రేజీ కాన్సెప్ట్ సినిమాలు అందించిన ఈ దర్శకుడితో సినిమా అంటే డెఫినెట్ గా మినిమమ్ అంచనాలు పెట్టుకోవచ్చు. సో మొత్తానికి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు పక్కా గానే దిగుతున్నారని చెప్పవచ్చు.

