గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 జులై 2018 (10:55 IST)

ప్రభుకు కుమార్తెగా, విష్ణు విశాల్‌కు జోడీగా శివానీ...

యాంగ్రీ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో హిందీలో ఘనవిజయం సాధించిన 2 స్టేట్స్ సినిమా తెలుగు రీమేక్‌లో శివానీ నటిస్తోంది. తెలుగులోనే కాకుండా తమి

యాంగ్రీ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ హీరోయిన్‌గా తెరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో హిందీలో ఘనవిజయం సాధించిన 2 స్టేట్స్ సినిమా తెలుగు రీమేక్‌లో శివానీ నటిస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 
 
తమిళంలో విష్ణు విశాల్ జోడీగా శివానీ ఓ సినిమా చేస్తోంది. వీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం మదురైలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 
 
తమిళ దర్శకుడు వెంకటేశ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ కథను సిద్ధం చేసుకుని, తనదైన శైలిలో ఆవిష్కరించనున్నాడు. ఈ సినిమా తరువాత మలయాళంలో మోహన్ లాల్ కుమారుడు ''ప్రణవ్''కు జోడీగా కూడా శివాని నటించనుందట.

తమిళంలో విష్ణు విశాల్‌తో జోడీ కట్టడంపై శివానీ మాట్లాడుతూ.. కాలేజీ అమ్మాయిగా ఇందులో కనిపిస్తానని, ప్రభుకు కుమార్తెగా గ్రామంలో పుట్టిన అమ్మాయిగా నటిస్తానని చెప్పుకొచ్చింది.