శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (18:45 IST)

చెన్నై హోటల్‌లో మందు.. విందుతో ఎంజాయ్ చేస్తున్న కౌన్సిలర్లు..

రాజకీయాలు ప్రస్తుతం రెస్టారెంట్ పాలిటిక్స్‌గా మారిపోతున్నాయి. గతంలో తమిళనాట ఎమ్మెల్యేలు రెస్టారెంట్లో బాగా ఎంజాయ్ చేశారు. ఆపై కర్ణాటకలో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజే

రాజకీయాలు ప్రస్తుతం రెస్టారెంట్ పాలిటిక్స్‌గా మారిపోతున్నాయి. గతంలో తమిళనాట ఎమ్మెల్యేలు రెస్టారెంట్లో బాగా ఎంజాయ్ చేశారు. ఆపై కర్ణాటకలో బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.


బీజేపీ బలనిరూపణలో ఓడించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాదు హోటళ్లలో వచ్చి బస చేశారు. ఈ విషయాలను పక్కనబెడితే.. తాజాగా తెలంగాణ బోధన్ మున్సిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు విందు వినోదాల్లో మునిగి తేలుతున్నారు. 
 
టీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు ఓటింగ్ దూరంగా ఉండేలా ఒప్పించిన అగ్రనేతలు వారిని చెన్నైలోని ఓ హోటల్‌కి తరలించడంతో అక్కడ మందు, విందుతో మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. బోధన్ మున్సిపల్ ఛైర్మన్‌‌పై 29మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈనెల 25న చర్చ జరగనుండగా ఎంపీ కవిత చొరవతో వారంతా యూటర్న్ తీసుకున్నారు.
 
అసమ్మతి కౌన్సిలర్లంతా ఓటింగ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో వారి మనసు మారకుండా ఉండేందుకు చెన్నై‌లోని ఓ హోటల్‌కి తరలించారు. ప్రస్తుతం కౌన్సిలర్లు మందు విందుతో ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.