1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. eyes black marks removes beauty care tips

కళ్ల కింద నల్లటి వలయాలకు బాదం నూనె రాసుకుంటే?

కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచిది. కొద్దిగా పసుపులో మజ్జిగను కలుపుకుని ఆ మిశ్రమాన్ని కళ్లు చుట్టూ రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవా

eyes
కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచిది. కొద్దిగా పసుపులో మజ్జిగను కలుపుకుని ఆ మిశ్రమాన్ని కళ్లు చుట్టూ రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చును.
 
పుదీనా ఆకులను పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని కళ్ల కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, కీరదోస రసం కలుపుకుని కళ్ల కింద నల్లటి వలయాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
ఇలా చేయడం వలన నల్లటి వలయాలు తొలగిపోయి కాంతివంతమైన ముఖాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. బాదం నూనెను కళ్ల చుట్టూ రాసుకుని 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత కాటన్‌తో తుడిచేయాలి. ఇలా చేస్తే కూడా నల్లటి వలయాలు తొలగిపోతాయి. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
ఉప్పునీటితో నోటిని పుక్కిలించితే ఏం జరుగుతుందో తెలుసా?