శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 6 ఆగస్టు 2018 (14:52 IST)

తేనెను మరిగించి చల్లారిన తరువాత దూదితో మర్దనా చేసుకుంటే?

ముఖం మీద అక్కడక్కడా కనిపించే చిన్న చిన్న నల్లని మచ్చలు చూడడానికి ఏమాత్రం అందంగా కనిపించవు. ఈ బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. బేకిండ్ సోడాను కొద్దిగా న

ముఖం మీద అక్కడక్కడా కనిపించే చిన్నచిన్న నల్లని మచ్చలు చూడడానికి ఏమాత్రం అందంగా కనిపించవు. ఈ బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. బేకిండ్ సోడాను కొద్దిగా నీటిలో కలుపుకుని ఆ నల్లటి మచ్చలకు రాసుకోవాలి. అది పొడిగా మారిన తరువాత నీటితో కడిగేసుకోవాలి. వారానికి ఇలా రెండుసార్లు చేయడం వలన బ్లాక్ హెడ్స్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
 
దాల్చిన చెక్కపొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని నల్లటి వలయాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముక్కుపై గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. డిస్టిల్డ్ నీటిలో ఓట్‌మీల్ పౌడర్‌ను కలుపుకుని రాసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. నిమ్మరసంలో కాటన్ బాల్స్‌ను ముంచి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతాలలో రాసుకోవాలి. 
 
కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడిగేసుకోవాలి. నీటిని మరిగించుకుని అందులో కొంచెం గ్రీన్ టీ పొడి వేసుకుని కాసేపటి తరువాత ఆ మిశ్రమాన్ని వడకట్టి అందులో దూదిని ముంచి ముఖానికి మర్దనా చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. తేనెను వేడిచేసుకోవాలి. దూదిని తేనెలో ముంచి ముఖానికి రాసుకోవాలి. 
 
20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. పాలలో పసుపు, నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన బ్లాక్ హెడ్స్ సమస్యలు తొలగిపోతాయి.