బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (15:43 IST)

భాగమతి తర్వాత సూర్యతో స్వీటీ సినిమా..? హిట్ ఖాయమేనంట!

సింగం సిరీస్‌లో సూర్యతో జతకట్టిన అనుష్క.. మళ్లీ సూర్యతో రొమాన్స్ పండించేందుకు సిద్ధమవుతోంది. భాగమతి సూపర్ హిట్ అయిన తర్వాత అనుష్క ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు హరి అనుష్కను సంప్రదించినట

సింగం సిరీస్‌లో సూర్యతో జతకట్టిన అనుష్క.. మళ్లీ సూర్యతో రొమాన్స్ పండించేందుకు సిద్ధమవుతోంది. భాగమతి సూపర్ హిట్ అయిన తర్వాత అనుష్క ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు హరి అనుష్కను సంప్రదించినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా హరికి మంచి పేరుంది. 
 
సూర్య హీరోగా చేసిన 'సింగం' సిరీస్ హరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూడు సినిమాల్లోను అనుష్క నటించింది. ఈసారి చేసేది 'సింగం' సీక్వెల్ కాకపోయినప్పటికీ, సూర్య జోడీగా అనుష్కను తీసుకోవాలని హరి భావిస్తున్నాడట. అందుకే అనుష్కకి కథ వినిపించేందుకు ఆయన సిద్ధపడుతున్నారని తెలిసింది. హరి, సూర్యతో తనది హిట్ కాంబినేషన్ కావడం వల్ల అనుష్క ఇందుకు అంగీకరించే అవకాశం ఉన్నట్లు టాక్.
 
మరోవైపు బాహబలి, భాగమతి సినిమాల తర్వాత మరో సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండిన అనుష్క.. మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాని ఒప్పుకుందని ఫిలిం నగర్ టాక్. డైరెక్టర్ హేమంత్ హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనుష్కకి వినిపించగా, కథనచ్చి ఈ సినిమాని అనుష్క ఓకే చేసినట్లుగా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని కోన కార్పొరేషన్ - పీపుల్స్ మీడియా వారు కలసికట్టుగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.