1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. BJP MP Harinarayan rajbhar demands purush aayog for men

భర్తలను ఏడిపిస్తున్న భార్యలు.. పురుష్ ఆయోగ్ ఏర్పాటు చేయండి...

ఇటీవలికాలంలో భార్యల చేతుల్లో హతమయ్యే భర్తల సంఖ్య పెరిగిపోతోందనీ, వేధింపులు కూడా మరింతగా హెచ్చుమీరిపోయాయని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ అన్నారు. దీంతో లోక్‌సభలో ఒక్కసారిగా నవ్వు

BJP
ఇటీవలికాలంలో భార్యల చేతుల్లో హతమయ్యే భర్తల సంఖ్య పెరిగిపోతోందనీ, వేధింపులు కూడా మరింతగా హెచ్చుమీరిపోయాయని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ హరినారాయణ్ రాజ్‌భర్ అన్నారు. దీంతో లోక్‌సభలో ఒక్కసారిగా నవ్వులు పూయించింది.
 
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో భాగంగా, ఆయన మాట్లాడుతూ, దేశంలో భర్తలను ఏడిపిస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, భార్యా బాధితులను ఆదుకునేందుకు 'పురుష్ ఆయోగ్'ను ఏర్పాటు చేయాలని కోరారు. 
 
ప్రస్తుతం దేశంలో మహిళల కోసం మహిళా ఆయోగ్ ఉందనీ అలాగే, పురుషుల కోసం పురుష్ ఆయోగ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఎందుకంటే భార్యల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, కొందరు జైలుకు కూడా వెళ్లారని గుర్తుచేశారు. అటువంటి వారిని కష్టాల నుంచి బయట పడేసేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నదే తన విజ్ఞప్తి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ప్రియుడితో భార్య రొమాన్స్... చూశాడనీ భర్త అంగాన్ని కొరికిన భార్య...