శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (18:54 IST)

గ్రీన్ ఛాలెంజ్.. నాగార్జున వంతు ముగిసింది.. ఇక సమంత, ధనుష్‌ వంతు...

హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి మేకర్, ఎస్ఎస్ రాజమౌళి కూడా కవిత ఛా

హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి మేకర్, ఎస్ఎస్ రాజమౌళి కూడా కవిత ఛాలెంజ్‌ను స్వీకరించి.. మొక్కను నాటారు. అలాగే మహేష్ బాబు, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు చెట్లను నాటారు. ఆపై ఇతరులకు సవాల్ విసిరారు. దీంతో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. 
 
ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మూడు మొక్కలు నాటి అక్కినేని నాగార్జునకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ ఛాలెంజ్‌‌ను నాగార్జున స్వీకరించి.. అన్నపూర్ణ స్టూడియోలో గురువారం మూడు మొక్కల్ని నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా నాగార్జున  ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు. కరణ్ జోహర్, సమంత, నటుడు ధనుష్‌‌కు గ్రీన్ ఛాలెంజ్ చేసినట్లు ట్విట్ చేశారు నాగార్జున. తన వంతు ముగిసిందని ఇక కోడలు సమంత వంతూ అంటూ నాగ్ ట్వీట్ చేశారు.