శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 11 జులై 2018 (11:34 IST)

సుశాంత్ ద‌శ తిరిగేనా..?

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం చి.ల.సౌ. ఈ చిత్రానికి హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రుహాని శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. విభిన్న క‌థా చిత్రంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన త‌క్కువ టైమ్‌లో కంప్లీట్ చేస

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం చి.ల.సౌ. ఈ చిత్రానికి హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రుహాని శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. విభిన్న క‌థా చిత్రంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన త‌క్కువ టైమ్‌లో కంప్లీట్ చేసుకుంది. స‌మ్మ‌ర్‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రావాలి కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న రాలేదు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే..షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్నది అన‌గా నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల వ‌ల‌న చేతులేత్తేసాడ‌ట‌.
 
దీంతో అప్ప‌టివ‌రకు చేసిన షూటింగ్‌ను నాగార్జున‌కు చూపిస్తే.. సినిమా చాలా బాగా వ‌చ్చింది అని సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేసేందుకు ముందుకు వ‌చ్చార‌ట‌. అందుక‌నే రాహుల్ ర‌వీంద్ర‌కు అన్న‌పూర్ణ స్టూడియోలో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చార‌ట‌. ఇక  ఈ మూవీని ఈ నెల 27న రిలీజ్ చేసేందుకు నిర్ణ‌యించారు. 
 
ఈ సినిమాకి అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను  పాజిటివ్ టాక్ ఉంది. మ‌రి.. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తోన్న స‌క్స‌స్ సుశాంత్‌కి ఈ సినిమాతో వ‌స్తుందా..? సుశాంత్ ద‌శ తిరుగుతుందా..? అనేది తెలియాలంటే ఈ నెల 27 వ‌ర‌కు ఆగాల్సిందే.