శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (17:00 IST)

ఆ హీరో వల్లే పెళ్లి చేసుకోలేదు.. మేమిద్దరం 25 యేళ్లు కలిసున్నాం...

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో మోస్ట్ ముదురు హీరోయిన్ ఎవరయ్యా అంటే ప్రతి ఒక్కరూ ఠక్కున చెప్పే సమాధానం టబు. ఈమె వయసు ఐదు పదుల వయసు సమీపిస్తున్నా ఇప్పటికీ పెళ్లిమాటెత్తడం లేదు. దీనికి గల క

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో మోస్ట్ ముదురు హీరోయిన్ ఎవరయ్యా అంటే ప్రతి ఒక్కరూ ఠక్కున చెప్పే సమాధానం టబు. ఈమె వయసు ఐదు పదుల వయసు సమీపిస్తున్నా ఇప్పటికీ పెళ్లిమాటెత్తడం లేదు. దీనికి గల కారణాలను మాత్రం ఇప్పటివరకూ వెల్లడించలేదు. అయితే, తాజాగా ఆమె తన మనసులోని మాటను వెల్లడించింది.
 
తాను పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ఓ హీరో కార‌ణ‌మ‌ని ట‌బు స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. "నేను వివాహం చేసుకోక‌పోవ‌డానికి కార‌ణం అజ‌య్ దేవ‌గ‌ణ్‌. త‌ను నా సోద‌రుడికి బంధువు. నా జీవితం ఆరంభం నుంచే అజ‌య్ నాతో క‌లిసి ఉన్నాడు. మేమిద్‌ రం 25 ఏళ్లు స్నేహితులుగా ఉన్నాం. అజ‌య్ కార‌ణంగానే నేను పెళ్లి చేసుకోలేదు. అలాగ‌ని, పెళ్లి చేసుకోనందుకు నాకేం బాధ లేదు" అని టబు వ్యాఖ్యానించింది. 
 
కాగా, దాదాపు రెండు ద‌శాబ్దాల క్రితం వెండితెర అరంగేట్రం చేసిన హైద‌రాబాదీ అమ్మాయి ట‌బు అటు బాలీవుడ్‌లోను, ఇటు టాలీవుడ్‌లోనూ మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం 50వ‌ ప‌డికి ద‌గ్గ‌ర ప‌డుతున్న టబు పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్‌గానే ఉంది. 
 
మీడియా ముందుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆమెకు త‌న పెళ్లి గురించిన ప్ర‌శ్నే ఎదుర‌వుతోంది. తాజాగా త‌ను పెళ్లి చేసుకోక‌పోవ‌డానికి ఓ హీరో కార‌ణ‌మ‌ని ట‌బు స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. అయితే, ఆ బాలీవుడ్ హీరో ఎలా కార‌ణ‌మ‌య్యేడ‌నే విష‌యం గురించి మాత్రం చెప్ప‌లేదు.