సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జులై 2018 (10:12 IST)

రెండో పెళ్లి సిద్ధమవుతున్న హీరోయిన్ మాజీ భర్త

మలయాళ కుట్టి అమలా పాల్ మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వాస్తవానికి విజయ్‌ను అమలా పాల్ 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, కొద్దిరోజుల్లోనే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతోవార

మలయాళ కుట్టి అమలా పాల్ మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వాస్తవానికి విజయ్‌ను అమలా పాల్ 2014లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, కొద్దిరోజుల్లోనే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతోవారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలా పాల్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయ్ దర్శకుడిగా కొనసాగున్నాడు.
 
ఈ నేపథ్యంలో విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యేడాది చివర్లో విజయ్ పెళ్లి చేయాలని ఆయన తల్లిదండ్రులు భావిస్తున్నారట. ప్రస్తుతం పెళ్లి కుమార్తెను వెతికే పనిలో ఉన్నారు. మరోవైపు, ఈ వార్తలన్నీ అబద్ధాలే అని విజయ్ స్నేహితులు కొట్టిపారేస్తుండటం గమనార్హం.