మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఆగస్టు 2025 (15:58 IST)

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

arrest
ఓ ఖైదీ జైలు నుంచి తప్పించుకుని నేరుగా తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఖైదీని అదుపులోకి తీసుకుని తిరిగి సబ్ జైలుకు పంపించారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. జైలు నుంచి తప్పించుకుని ప్రియురాలి ఇంటిలో దాగిన ఖైదీని కేవలం 24 గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నాగలాపురానికి చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తిని గత నెల 20 తేదీన దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం సత్యవేడు సబ్ జైలులో ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం జైలు నుంచి శ్రీనివాసన్ కనిపించకుండా పోయినట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అతని ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు నగరంలో గాలింపు చర్యలు చేపట్టగా, తన పాత ప్రియురాలు ఇంట్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకుని మళ్లీ  సబ్ జైలుకు తరలించారు.