1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జులై 2025 (13:35 IST)

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Tirupathi
Tirupathi
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, నిర్మానుష్య ప్రాంతాలు, నగర శివార్లలో గంజాయి వినియోగం, పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 
 
రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతిలో మాట్రిక్స్ ఫోర్ థర్మల్ డ్రోన్‌లను రాత్రి గస్తీ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ల సహాయంతో అనుమానిత ప్రాంతాలను సులువుగా గుర్తించి, తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఇదే క్రమంలో తాజాగా తుమ్మలగుంట ఫ్లైఓవర్‌పై ఫోటోషూట్ పేరుతో యువకులు హల్ చల్ చేశారు. ఫోటోషూట్ పేరుతో వాహనదారులకు ఇబ్బంది కలిగించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే డ్రోన్‌ను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై హెచ్చరించి వదిలిపెట్టారు.