Tirupati Stampede డిఎస్పీ వల్ల తొక్కిసలాట, అంబులెన్స్ డ్రైవర్ పత్తాలేడు
Tirupati Stampede వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించారు. అక్కడ భక్తులను అదుపుచేయాల్సిన డిఎస్పీ అత్యుత్సాహం వల్లనే ఒక్కసారిగా భక్తులు తోసుకుంటూ రావడంతో తొక్కిసలాట జరిగిందని పేర్కొన్నారు.
తొక్కిసలాట జరిగినా డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసారు. చికిత్స కోసం అంబులెన్స్ వాహనాన్ని పిలువగా వాహనాన్ని టికెట్ కౌంటరు దగ్గర పార్క్ చేసి డ్రైవర్ ఎటో వెళ్లిపోయాడు. వీళ్లిద్దరి కారణంగానే భక్తులు ప్రాణాలు కోల్పోయారు'' అని తన నివేదికలో పేర్కొన్నారు.